ఫైనల్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ స్పెషల్ కిక్..!

ఫైనల్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ స్పెషల్ కిక్..!

27 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టు ఆనందానికి అవదులులేకుండాపోయాయి.. అయితే, ఇదే సందర్భంలో యూకేలోని క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు, ప్రజలకు కిక్ ఇచ్చే వార్తను చెప్పింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు... వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ యూకే అంతటా ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయించింది. లార్డ్స్‌ వేదికగా రేపు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ను యూకే అంతటా ఉచితంగా ప్రసారం చేస్తారు. కాగా, ఇంగ్లండ్ జట్టు వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు చేరితే.. ఆ మ్యాచ్‌ను ఫ్రీ టు ఎయిర్‌గా ప్రసారం చేయనున్నట్టు స్కై స్పోర్ట్స్ ఛాన‌ల్ సెమీస్ మ్యాచ్‌కు ముందే ప్రకటించింది. ఇక, ఇంగ్లండ్ ఫైనల్‌లో అడుగుపెట్టడంతో ఆ మ్యాచ్‌ను స్కై ఛాన‌ల్ ఫ్రీ టు ఎయిర్‌గా ప్ర‌సారం చేయనుంది. మరోవైపు యూకేలో 2005 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్కై స్పోర్ట్స్‌ చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుతం యూకేలో ప్రసార హక్కులను చానెల్‌ 4 దక్కించుకుంది. స్కై స్పోర్ట్స్‌తో వ్యవహారం కుదరకపోవడంతో ఆ సంస్థ ఒప్పందం చేసుకోలేదు. అయితే, ఇంగ్లండ్‌ ఫైనల్‌ చేరిన నేపథ్యంలో చానెల్‌ 4 దిగొచ్చింది. సబ్‌స్ర్కిప్షన్‌ ధరలు భారీగా ఉండడంతో చాలా మంది ఇంగ్లండ్ అభిమానులు ప్రపంచకప్‌ మ్యాచ్‌లను టీవీల్లో చూడడం లేదని ఓ సర్వే తేల్చింది.. దీందో క్రికెట్‌కు ఆదరణ తేవాలన్న ఉద్దేశంతో ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఏదేమైనా సుదీర్ఘ కాలం తర్వాత తమ దేశం... ఐసీసీ మెగా ఈవెంట్‌ ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతోందంటే.. ఎవరు మాత్రం ఊరుకుంటారు...? ఇతర దేశాల సంగతి ఏమో గానీ... ఇటు ఇంగ్లండ్... అటు.. న్యూజిలాండ్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోవడం ఖాయమే మరి..!