వరల్డ్‌కప్‌కు ఈసారి కొత్త ఛాంపియన్‌

వరల్డ్‌కప్‌కు ఈసారి కొత్త ఛాంపియన్‌

వరల్డ్‌కప్‌కు ఈసారి కొత్త చాంపియన్‌ రాబోతోంది. రెండో సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ తలపడబోతోంది. ఫైవరెట్‌గా అడుగుపెట్టిన ఇంగ్లండ్‌.. ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో సెమీస్‌లో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. 49 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. స్టీవెన్‌ స్మిత్‌ (85; 119 బంతుల్లో 6x4), కేరీ (46; 70 బంతుల్లో 4x4) మినహా మరెవరూ రాణించలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్, రషీద్‌లు చెరో 3 వికెట్లు కూల్చగా.. ఆర్చర్‌ 2 వికెట్లు తీశాడు. 

224 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. అలవోకగా విజయం సాధించింది. కేవలం 32.1 ఓవర్లలో రెండంటే రెండో వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జేసన్‌ రాయ్‌ (85; 65 బంతుల్లో 9x4, 5x6) మరోసారి చెలరేగాడు. రూట్‌ (49 నాటౌట్‌; 46 బంతుల్లో 8x4), మోర్గాన్‌ (45 నాటౌట్‌; 39 బంతుల్లో 8x4), బెయిర్‌స్టో (34; 43 బంతుల్లో 5x4) రాణించడంతో హోం టీమ్‌ ఫైనల్స్‌కు చేరింది.