20 ఏళ్లలో పాకిస్థాన్ పై ఇంగ్లాండ్ మొదటిసారి...  

20 ఏళ్లలో పాకిస్థాన్ పై ఇంగ్లాండ్ మొదటిసారి...  

శనివారం జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రారంభ టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ భారీ విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని జోస్ బట్లర్ (75), క్రిస్ వోక్స్ (84) తో రాణించడంతో ఇంగ్లాండ్ చేధించింది. ఈ 277 పరుగుల రన్ చేజ్ టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు 10 వ అత్యధిక చేజ్. 164 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ 275 లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని చెస్ చేసినప్పుడు వారు 10 గెలిచారు, 103 ఓడిపోయారు మరియు 51 సార్లు డ్రా చేసుకున్నారు. 2008 తరువాత మొదటిసారి ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంత లక్ష్యాన్ని ఛేదించడం ఇంగ్లాండ్ కు ఇదే మొదటిసారి. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 250 ప్లస్ ఛేదనలో ఇంగ్లాండ్ 2 గెలిచి 7 ఓడిపోయి 2 మ్యాచ్‌లను డ్రా చేసింది. ఇక టెస్ట్ క్రికెట్‌లో 2000 సంవత్సరం నుండి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా 250 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించడం ఇంగ్లాండ్ కు ఇదే మొదటిసారి. ఈ రెండు జట్ల మధ్య ఇటువంటివి మొత్తం 35 మ్యాచ్లు జరగగా 26 పాక్ గెలిచింది, 8 డ్రాగా ముగిసాయి. కానీ నిన్న మొదటిసారి ఇంగ్లాండ్  విజయం సాధించింది.