ఇంగ్లండ్‌ జట్టుకు ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా..?

ఇంగ్లండ్‌ జట్టుకు ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా..?

ఇంగ్లండ్ జట్టు ప్రపంచవిజేతగా అవతరించింది. సొంతగడ్డపై మెగా టోర్నీని గెలుచుకుని సత్తా చాటింది. కొన్నాళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న ఇంగ్లీష్‌ జట్టు.. తమవి గాలి వాటం గెలుపులు కాదని నిరూపిస్తూ ప్రపంచ్‌కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. వరల్డ్‌కప్ ట్రోఫీతోపాటు ప్రైజ్‌మనీగా రూ. 27.42 కోట్లు గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు రూ. 13.71 కోట్ల ప్రైజ్‌ మనీ దక్కింది. ఇక.. సెమీస్‌లో ఓడిన ఇండియా, ఆస్ట్రేలియా జట్టకు చెరో రూ. 5.48 కోట్లు ఇచ్చింది ఐసీసీ. ఇక.. లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కుగాను ప్రతి జట్టుకూ సుమారు రూ.27.4లక్షలు ఐసీసీ చెల్లించింది.