ఇంగ్లండ్‌ చేతిలో అఫ్గానిస్థాన్‌ చిత్తు 

ఇంగ్లండ్‌ చేతిలో అఫ్గానిస్థాన్‌ చిత్తు 

వరల్డ్‌కప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు మరోసారి విరుచుకుపడింది. పసికూన అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్ (148; 71 బంతుల్లో, 4 ఫోర్లు, 17 సిక్సులు) చెలరేగాడు. ఆఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ నమోదు చేశాడు. జానీ బెయిర్‌స్ట్రో( 90; 99 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సులు), జోరూట్ (88; 82 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సు) చక్కగా రాణించారు. చివరి ఓవర్లో మొయిన్‌ అలీ (31; 9 బంతుల్లో) వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఆఫ్గాన్ బౌలర్లలో దౌలత్ జోర్ధాన్, గులాబుద్దీన్ నైబ్ తలో మూడు వికెట్లు తీశారు. 

398 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేయగలిగింది. హష్మతుల్లా 76, రహమత్ షా 46 పరుగులు చేశారు.