ముగిసిన రెండో సెషన్... 

ముగిసిన రెండో సెషన్... 

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మొదటి రోజు ఆటలో రెండో సెషన్ ముగిసింది. అయితే మొదటి సెషన్ పూర్తయే సమయానికి 74 పరుగులు చేసి మడ్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ప్రస్తుతం 144/5 తో నిలిచింది. అయితే రెండో సెషన్ లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్(55) అర్ధశతకంతో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఇంగ్లాండ్ తిరిగి కోలుకుంది. ఇక ఈ రెండో సెషన్ లో భారత బౌలర్లు సిరాజ్, సుందర్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ప్రస్తుతం క్రీజులో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ డేనియల్(15), ఆలీ పోప్(21)  ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఇప్పటివరకు సీనియర్ బౌలర్లు అశ్విన్, ఇషాంత్ కు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. అయితే ఈ మొదటి రోజు ఆట ముగియడానికి ఇంకా 34 ఓవర్లు ఉన్నాయి. చూడాలి మరి ఈరోజు ఆట ముగిసే లోపు భారత బౌలర్లు ఇంకా ఎన్ని వికెట్లు తీస్తారు అనేది.