భారత్‌తో సిరీస్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం..

భారత్‌తో సిరీస్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం..

భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ జట్టులో చోటు కోల్పోయాడు. ఇటీవల పాకిస్థాన్‌తో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో గాయపడిన స్టోక్స్ ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో అతడిని సెలెక్టర్లు పక్కనపెట్టారు. భారత్‌తో సిరీస్‌తోపాటు ఆస్ట్రేలియాతో జరగనున్న ఏకైక టీ20 కోసం ఇవాళ ఇంగ్లండ్‌ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో స్టోక్స్‌కు స్థానం లభించలేదు. 
ఇంగ్లాండ్‌ జట్టు..
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బారిస్టో, జాక్ బాల్, జోస్ బట్లర్, టామ్ కుర్రాన్, సామ్ కుర్రాన్, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్దన్, ప్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ