ఇంగ్లండ్ ఎదురీత..!

ఇంగ్లండ్ ఎదురీత..!

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఎదురీదుతోంది... తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 241 పరుగులు చేసి... ఇంగ్లండ్ ముందు 242 పరుగుల టార్గెట్‌ను పెట్టగా... 71 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. ఓపెనర్ జాసన్ రాయ్ 17 పరుగులు చేసి వెనుదిరగగా.. 30 బంతులు ఎదుర్కొన్న రూట్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక మూడో వికెట్ రూపంలో బెయిర్‌స్టో 36 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మోర్గాన్ 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు... ఇక 25 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు 95 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 9 పరుగులతో... బట్లర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.