ఒక్కరోజే 5 తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అంపైర్లు... 

ఒక్కరోజే 5 తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అంపైర్లు... 

కరోనావైరస్ మహమ్మారి కారణంగా 117 రోజుల విరామం తర్వాత క్రికెట్ తిరిగి ప్రారంభమైనది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా క్రికెట్‌ను పునః ప్రారంభించే ముందు వివిధ దేశాల బోర్డులతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొన్ని నియమ నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటివల్ల వైరస్ కారణంగా ఆటకు ఎటువంటి ఆటంకం కలగదు. అందులో..  లాలాజల వాడకం పై నిషేధం మరియు హోమ్ అంపైర్ల వాడకం రెండు ప్రధాన మార్పులు. అందువల్ల ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ మధ్య  జరుగుతున్న చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ బుధవారం ప్రారంభమైనప్పుడు,  బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారు అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. కానీ ఆ మ్యాచ్ లో ఉన్న అంపైర్లు ప్రేక్షకుల దృష్టిని తప్పుడు నిర్ణయాలుతో తమ పైకి తిప్పుకున్నారు. ఇంగ్లాండ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్బరో మరియు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఈ మ్యాచ్ లో చాలా ఒత్తిడికి గురయ్యారు. ఎంతలా అంటే...  మొదటిసారి ఒక టెస్ట్ మ్యాచ్ కు అంపైరింగ్ చేస్తున్నారా అనే అనుమానం వచ్చేలాగా, ఈ ఇద్దరు అంపైర్లు  ఒక్కరోజే 5 తప్పుడు నిర్ణయాలు ఇచ్చారు. కానీ ఒత్తిడి లేని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ప్రతిసారి డిఆర్ఎస్ తీసుకొని విజయవంతం అయ్యాడు.