ఆఫ్గాన్ లక్ష్యం: 398

ఆఫ్గాన్ లక్ష్యం: 398

ఐసీసీ ప్రపంచ కప్ లో భాగంగా ఆఫ్గానిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్లు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్ (148; 71 బంతుల్లో, 4 ఫోర్లు, 17 సిక్సులు) చెలరేగాడు. ఆఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ నమోదు చేశాడు. జానీ బెయిర్‌స్ట్రో( 90; 99 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సులు), జోరూట్ (88; 82 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సు) చక్కగా రాణించారు. చివరి ఓవర్లో మొయిన్‌ అలీ (31; 9 బంతుల్లో) వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఆఫ్గాన్ బౌలర్లలో దౌలత్ జోర్ధాన్, గులాబుద్దీన్ నైబ్ తలో మూడు వికెట్లు తీశారు.