ఇంగ్లాండ్ టార్గెట్ః 286

ఇంగ్లాండ్ టార్గెట్ః 286

లార్డ్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు సాధించింది. ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (100;116 బంతుల్లో 11ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ నమోదు చేయగా.. డేవిడ్‌ వార్నర్‌(53; 61 బంతుల్లో 6ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆర్డర్‌ మరోసారి విఫలమవడంతో ఇంగ్లండ్‌ ముందు ఆసీస్‌ భారీ స్కోర్‌ను నిర్దేశించలేకపోయింది. తొలుత అంతగా ఆకట్టుకోని ఇంగ్లీష్‌ బౌలర్లు చివర్లో విజృంభించి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించారు. 30 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ ఒక్క వికెట్‌ నష్టానికి 162 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌, స్టోయినిస్‌ వంటి హిట్టర్లు ఉండటంలో ఇంగ్లండ్‌ ముందు ఆసీస్‌ భారీ స్కోర్‌ సాధిస్తుందనుకున్నారు. అయితే చివరి ఓవర్లను ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. స్మిత్‌(38), ఖవాజా(23), మ్యాక్స్‌వెల్‌(12), స్టొయినిస్‌(8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ రెండు వికెట్లతో రాణించగా.. ఆర్చర్‌, వుడ్‌, స్టోక్స్‌, మొయిన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.