టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ఐసీసీ ప్రపంచ కప్ లో భాగంగా లార్డ్స్ లో జరుగుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో 10పాయింట్లతో ఆసీస్ రెండో స్థానంలో ఉండగా, ఎనిమిది పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకంగా మారింది. 

ఇంగ్లాండ్‌ జట్టు: జేమ్స్‌ విన్స్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, ఇయాన్‌మోర్గాన్‌(కెప్టెన్‌), బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, మోయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, అదిల్‌ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌వుడ్‌.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆలెక్స్‌ కారే, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయన్‌, జేసన్‌ బెరెండార్ఫ్‌