బంగ్లాపై ఇంగ్లాండ్ భారీ స్కోరు

బంగ్లాపై ఇంగ్లాండ్ భారీ స్కోరు

ఐసీసీ ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్లు బంగ్లా బౌలర్లపై విరుచుకుపడింది. ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ జేసన్ రాయ్ (153; 121 బంతుల్లో, 14 ఫోర్లు, 5 సిక్సులు ) సెంచరీ సాధించాడు. వన్డేల్లో అతనికిది తొమ్మిదో శతకం కావడం విశేషం. ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా వెనకడుగు వేయకుండా బౌండరీలతో విజృంభిస్తూ రాయ్ రన్స్ సాధించాడు. ముస్తాఫిజుర్ వేసిన 27వ ఓవర్‌లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేశాడు. బ్రిస్టో (51; 50 బంతుల్లో 6 ఫోర్లు) అతడికి చక్కటి సహకారం అందించాడు. అనంతరం వచ్చిన జాస్ బట్లర్(64; 44 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(35) కూడా రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ నమోదు చేసింది. బంగ్లా బౌలర్లో మహమ్మద్ సైఫోద్దిన్, మెహందీ హసన్ తలో రెండు వికెట్లు, ముస్తాఫిజూర్ రహీం, మోర్తాజా తలో వికెట్ సాధించారు.