ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఏడు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ అలెస్టక్ కుక్(13) త్వరగానే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ జో రూట్ మరో ఓపెనర్ జెన్నింగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం జెన్నింగ్స్(42) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సమయానికే డేవిడ్ మలన్(8) కూడా పెవిలియన్ బాటపట్టాడు.

ఈ దశలో జో రూట్.. బెయిర్‌స్టోతో కలిసి చెలరేగి ఆడటంతో నాలుగో వికెట్‌కి 104 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే అర్ధసెంచరీని కూడా పూర్తి చేసాడు. అనంతరం రూట్(80), బెయిర్‌స్టో(70), జాస్ బట్లర్(0)లు అవుట్ అయ్యారు. కష్టాల్లో ఉన్న జట్టును ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్(21) ఆదుకొనే ప్రయత్నం చేశాడు.. కానీ అశ్విన్‌కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 81 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో అదిల్ రషీద్(12), సామ్  కుర్రం(21)లు ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు, షమీ రెండు, ఉమేష్ ఒక వికెట్  తీశారు.