భారత్ విజయలక్ష్యం 194

భారత్ విజయలక్ష్యం 194

ఇంగ్లండ్‌తో గడ్డపై భారత బౌలర్లు సత్తా చాటారు. తొలి టెస్టు రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 180 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ విజయలక్ష్యం 194 పరుగులు. టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ టాపార్డర్‌ను దెబ్బతీయగా.. సీనియర్ పేసర్ ఇషాంత్‌ శర్మ మిడిల్ ఆర్డర్‌ను కుదేలుచేసాడు. కుక్, జెన్నింగ్స్, రూట్ లను అశ్విన్ పెవిలియన్ చేర్చి ఇంగ్లాండ్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. అనంతరం ఇషాంత్ ఒకే ఓవర్లో మూడు కీలక వికెట్లు తీసి కోలుకోకుండా చేసాడు. ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌ వరకు 85/4గా ఉన్న ఇంగ్లండ్‌ జట్టును ఆ ఒక్క ఓవర్లోనే 87/7 గా మార్చాడు. జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌, జొస్ బట్లర్‌లను పెవిలియన్ పంపి ఇంగ్లాండ్ ను దెబ్బ తీసాడు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన కర్రన్ అర్ధ సెంచరీ చేసి స్కోరును పెంచాడు. ఉమేష్ యాదవ్ కర్రన్(63), రషీద్(16)లను అవుట్ చేసాడు. ఇక చివరగా బ్రాడ్(11) ఇషాంత్ చేతికి చిక్కడంతో.. ఇంగ్లాండ్ జట్టు 53 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. పేసర్ ఇషాంత్‌ శర్మ ఐదు, అశ్విన్ మూడు, ఉమేష్ రెండు వికెట్లు తీశారు.