ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోర్ 9/1 తో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగీష్ జట్టు .. భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, పేస్ బౌలర్ ఇషాంత్ దెబ్బకు కుదేలైంది. అశ్విన్, ఇషాంత్ బంతులను ఎదుర్కోలేక ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ తడబడ్డారు. గురువారం ఓపెనర్ అలిస్టర్‌ కుక్‌ (0)ను అవుట్ చేసిన అశ్విన్.. మరో ఓపెనర్‌ కీటన్‌ జెన్నింగ్స్‌ (8) ని కూడా పెవిలియన్ చేర్చాడు. అనంతరం జో రూట్‌, డేవిడ్ మలాన్ లు ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే జో రూట్‌(14)ను అశ్విన్ అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటాడనుకున్న మలాన్(20).. పేస్ బౌలర్ ఇషాంత్ కి చిక్కాడు. దీంతో 70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మరో నాలుగు ఓవర్ల తర్వాత ఇషాంత్ ప్రమాదకర స్టోక్స్(6), బరిస్టో(28)లను ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. 

లంచ్ సమయానికి 30.4 ఓవర్లలో ఇంగ్లాండ్‌ 86/6తో ఉంది. ప్రస్తుతం క్రీజ్ లో బట్లర్(1) ఉన్నాడు. అశ్విన్, ఇషాంత్ తలో మూడువికెట్లు తీశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 99 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 287 పరుగులు చేయగా.. విరాట్‌ కోహ్లీ (149) సెంచరీతో భారత్‌ 274 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.