ఇంగ్లాండ్-ఐర్లాండ్ : ఇంగ్లాండ్ ఆల్ ఔట్.. ఐర్లాండ్ లక్ష్యం...?

ఇంగ్లాండ్-ఐర్లాండ్ : ఇంగ్లాండ్ ఆల్ ఔట్.. ఐర్లాండ్ లక్ష్యం...?

కరోనా విరామం తర్వాత ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య మొదటి అంతర్జాతీయ వన్డే సిరీస్ జరుగుతుంది. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఈ రోజు చివరి నామమాత్రపు మ్యాచ్ జరుగుతుంది. ఎందుకంటే... ఇప్పటికే  జరిగిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించడంతో ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ రోజు మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తమ ఇన్నింగ్స్ లో ఒక బంతి మిగిలి ఉండగా ఆల్ ఔట్ అయ్యింది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఎయోన్ మోర్గాన్ (106) సెంచరీతో అలాగే టామ్ బాంటన్(58), డేవిడ్ విల్లీ(51) అర్ధ శతకాలతో రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు 328 పరుగులు చేసింది. ఇక ఐర్లాండ్ బౌలర్లలో  క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు తీసుకోగా కర్టిస్ కాంపర్, జాషువా లిటిల్ 2 వికెట్లు, గారెత్ డెలానీ, మార్క్ అడైర్ చెరొక వికెట్ తీసుకున్నారు. అయితే ఐర్లాండ్ ఈ మ్యాచ్ గెలవాలంటే 329 పరుగులు చెయ్యాలి. కానీ ఇంగ్లాండ్ జట్టును చూస్తుంటే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను వైట్ వాష్ చేసేలా కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.