ఇంగ్లాండ్-పాకిస్థాన్ : పొట్టి సిరీస్ ను కూడా వదలని వర్షం...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : పొట్టి సిరీస్ ను కూడా వదలని వర్షం...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య ఈ రోజు మొదటి టీ 20 మ్యాచ్ జరుగుతుంది. అందులో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కి దిగ్గిన ఇంగ్లాండ్ 16.1 ఓవర్లలో 131 పరుగులు చేసి 6 వికెట్లు చేజార్చుకుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ను రోజు పలకరించిన వరుణుడు ఈ పొట్టి సిరీస్ కు కూడా వచ్చేసాడు. కాబట్టి ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది. ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ లలో ఓపెనర్ టామ్ బాంటన్ (71) ఒక్కడే రాణించాడు. ఇక ఇప్పటివరకు పాక్ బౌలర్లు ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా ఇఫ్తిఖర్ అహ్మద్ ఒక వికెట్ సాధించాడు. వర్షం కారణంగా ఆగిపోయిన ఈ మ్యాచ్ మళ్ళీ ప్రారంభమవుతుందా... లేదా అనేది చూడాలి.