ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మొదటి మ్యాచ్ గెలిచిన వరుణుడు

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మొదటి మ్యాచ్ గెలిచిన వరుణుడు

కరోనా విరామం తర్వాత మొదటి అంతర్జాతీయ టీ 20 సిరీస్ ఈ రోజు ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య ప్రారంభమైంది. అయితే మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో భాగంగా ఈ రోజు జరిగిన మొదటి మ్యాచ్ లో మధ్యలో వచ్చిన వరుణుడు విజయం సాధించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్ అనుకున్నవిధంగానే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేసింది. 16.1 ఓవర్లలో 131 పరుగులు చేసి 6 వికెట్లు చేజార్చుకుంది ఇంగ్లాండ్. అందులో ఓపెనర్ టామ్ బాంటన్ (71) ఒక్కడే రాణించాడు. ఆ తర్వాత ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది. అయితే ఇంతకముందు ఈ రెండు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా వరుణుడి రాకతో చివరి రెండు మ్యాచ్ ల ఫలితం తేలకుండా డ్రా గా ముగిసాయి. అయిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్ సిరీస్ సొంతం చేసుకుంది. కానీ ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనే వచ్చిన వరుణుడు తర్వాతి రెండు మ్యాచ్లనైనా జరగనిస్తాడా... లేదా అనేది చూడాలి.