ఇంగ్లాండ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న పాకిస్థాన్....

ఇంగ్లాండ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న పాకిస్థాన్....

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో పాకిస్థాన్ పట్టు బిగిస్తుంది. నిన్న జరిగిన రెండో రోజులో పాక్ జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఆట ప్రారంభించే సమయానికి 139/2 వద్ద పాక్ 326 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. అందులో ఓపెనర్ షాన్ మసూద్ (156) తో అద్భుతంగా రాణించాడు. ఇక తన కెరియర్ లో ఇదే అత్యధికం. అలాగే అజామ్(69), షాదాబ్ ఖాన్(45) మినహా మిగతా ఎవరు అంతగా రాణించలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ మూడేసి వికెట్లు తీసుకోగా క్రిస్ వోక్స్ 2 వికెట్లు, జేమ్స్ ఆండర్సన్, డోమ్ బెస్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం తమ మొదటి  ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కేవలం 12 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఆట ముగిసే సమయానికి మరో వికెట్ కూడా ఇచ్చేసింది. 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసిన ఇంగ్లాండ్ తన టాప్ ఆర్డర్ మొత్తం మొత్తం కోల్పోయింది. పాకిస్థాన్  బౌలర్లలలో మొహమ్మద్ అబ్బాస్ 2 వికెట్లు, షాహీన్ అఫ్రిది, యాసిర్ షా ఒక్కో వికెట్ తీసుకున్నారు. అయితే వెస్టిండీస్ మీద అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ పాక్ తో మాత్రం ఒత్తిడికి గురవుతుంది అని చెప్పాలి.