ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మొదటి టెస్ట్ మూడో రోజు... 

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మొదటి టెస్ట్ మూడో రోజు... 

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మొదటి రెండు రోజులు పాకిస్థాన్ పై చేయి సాధించింది. పాక్ మొదటి ఇన్నింగ్స్ లో ఓపెనర్ షాన్ మసూద్ (156), అజామ్(69), షాదాబ్ ఖాన్(45) రాణించడంతో 326 పరుగులు చేసింది. ఇక నిన్న తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును ఓపెనర్స్ తో పాటుగా స్టోక్స్, రూట్ ఇద్దరు కూడా నిరాశపరిచారు. మొదట కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. అంటే ఇంగ్లాండ్ ఇంకా పాక్ కంటే 234 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ఈ రోజు ఆలీ పోప్(46), జోస్ బట్లర్(15) వద్ద బ్యాటింగ్ ప్రారంభించారు. అయితే కరేబియన్లను ధీటుగా ఎదుర్కొన ఇంగ్లాండ్ పాక్ పై మాత్రం తడబడుతుంది.