పాకిస్థాన్ ను కట్టడి చేస్తున్న ఇంగ్లాండ్...

పాకిస్థాన్ ను కట్టడి చేస్తున్న ఇంగ్లాండ్...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మూడో రోజు రెండు జట్లు రాణించాయి. ఇంగ్లాండ్ నిన్నటి ఆటను 92/4 వద్ద ప్రారంభించింది. కానీ పాక్ బౌలర్ల దాడిని ఎదుర్కోలేక 209 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. ఆలీ పోప్(62) ఒకడే అర్ధ సెంచరీ సాధించాడు. దాంతో పాక్ 115 పరుగుల ఆధిక్యం సాధించింది. పాక్ బౌలర్లలో యాసిర్ షా 4 వికెట్లు తీసుకోగా మొహమ్మద్ అబ్బాస్, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా ఒక్కో వికెట్ తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించిన పాక్ ను రెండో ఇన్నింగ్స్ లో ఆతిధ్య బౌలర్లు కట్టడి చేసారు. ఆట ముగిసే సమయానికి కేవలం 137 పరుగులకే 8 వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం యాసిర్ షా (12), మొహమ్మద్ అబ్బాస్(0) వద్ద ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్,  క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ రెండేసి వికెట్లు తీసుకోగా డొమినిక్ బెస్ ఒక వికెట్ పడగొట్టాడు. అయితే నిన్న ఒక్క రోజు మాత్రమే మొత్తం 14 వికెట్లు పడ్డాయి. అంటే నిన్నటి ఆటలో బ్యాట్స్మెన్స్ కంటే బౌలర్లే రాణించారు.