ఇంగ్లాండ్-పాకిస్థాన్ : 196 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : 196 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య ఈ రోజు జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ భారీ లక్ష్యాన్ని చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ బాట్స్మెన్ లలో హఫీజ్(69), కెప్టెన్ బాబర్ ఆజమ్(56) అర్ధశతకాలతో రాణించడంతో మొత్తం నాలుగు వికెట్ల నష్టానికి నిర్ణిత ఓవర్లలో పాక్ 195 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్‌ రషీద్ 2 వికెట్లు, క్రిస్ జోర్డాన్, టామ్ కుర్రాన్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఇక 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఇంగ్లాండ్ జట్టు గెలుపు కష్టమే అనుకున్నారు అందరూ. కానీ ఇంగ్లాడ్ బ్యాట్స్మెన్స్ లలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (66), డేవిడ్ మలన్ (54*) అర్ధశతకాలు బాదడంతో విజయం సాధించింది. వీరికి తోడుగా వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (44) తో రాణించడంతో 19.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి పాక్ ను ఓడించింది. అయితే పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు, హరిస్ రౌఫ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక హాఫ్ సెంచరీతో తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో 1-0 తో ఆధిక్యంలోకి వెళ్ళింది.