ఇంగ్లాండ్-పాకిస్థాన్ రెండో టెస్ట్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 

ఇంగ్లాండ్-పాకిస్థాన్ రెండో టెస్ట్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 

కరోనా విరామం తర్వాత పాకిస్థాన్ తన మొదటి అంతర్జాతీయ టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ తో ఆడుతుంది. కానీ ఇంగ్లాండ్ కు మాత్రం ఇది రెండో సిరీస్. మొదటిది వెస్టిండీస్ తో ఆడి విజయం సాధించింది. అదే తరహా ఆటను ఇప్పుడు పాక్ పై కూడా కొనసాగిస్తుంది. ఇక ఇంతక ముందు జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి 3 మ్యాచ్ ల ఈ సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో ఉంది. ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అవుతుంది. అందులో టాస్ గెలిచినా పాక్  బ్యాటింగ్ ఎంచుకుంది. మరి ఈ మ్యాచ్ లో పాక్ విజయం సాధిస్తే సిరీస్ వారి చేతిలో ఉంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే సేరి వారి కైవసం అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. 

ఇంగ్లాండ్ జట్టు : రోరే బర్న్స్, డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జో రూట్ (C), ఆలీ పోప్, జోస్ బట్లర్ (Wk), క్రిస్ వోక్స్, సామ్ కుర్రాన్, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

పాకిస్థాన్ జట్టు : షాన్ మసూద్, అబిద్ అలీ, అజార్ అలీ (C), బాబర్ ఆజం, అసద్ షఫీక్, ఫవాద్ ఆలం, మహ్మద్ రిజ్వాన్ (Wk), యాసిర్ షా, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా