ఇంగ్లాండ్-పాకిస్థాన్ : రెండో టెస్ట్ రెండో రోజుకు వరుణుడు అడ్డు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : రెండో టెస్ట్ రెండో రోజుకు వరుణుడు అడ్డు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో నిన్న రెండో టెస్ట్ ప్రారంభమైంది. జరిగిన మొదటి రోజులో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేసింది అనే చెప్పాలి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ కేవలం 126 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. పాక్ ఓపెనర్ అబిద్ అలీ (60) ఒక్కడే రాణించాడు. అయితే నిన్నటి మ్యాచ్ కు మధ్యలో అలాగే చివర్లో వరుణుడు రావడంతో ఆట కాసేపు నిలిచిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు జేమ్స్ ఆండర్సన్ 2 వికెట్లు తీసుకోగా స్టువర్ట్ బ్రాడ్, సామ్ కర్రన్, క్రిస్ వోక్స్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఇక ఈ రోజు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ కు మళ్ళీ వరుణుడు అడ్డుపడ్డాడు. దాంతో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యం అవుతుంది.