ఇంగ్లాండ్-పాకిస్థాన్ : వరుణుడి ఖాతాలో మూడో రోజు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : వరుణుడి ఖాతాలో మూడో రోజు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజును వరుణుడు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్క బాల్ కూడా పడకుండానే మూడో రోజు ముగిసిపోయింది. జరిగిన మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో 1-0 తో ఆధిక్యం లోకి వెళ్ళింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ కు రోజు వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం పాక్ తన మొదటి ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అయితే ఐదు రోజుల్లో  ఒక రోజు పోవడంతో ఈ మ్యాచ్ డ్రా కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.  రేపు నాలుగో రోజు అయిన ఆట కొనసాగుతుందా... లేక మళ్ళీ వరుణుడు వస్తాడా అనేది.