ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మూడో రోజుకు కూడా వరుణుడు అడ్డు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మూడో రోజుకు కూడా వరుణుడు అడ్డు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ కు వరుణుడు ప్రతిరోజు వస్తున్నాడు. జరిగిన గత రెండురోజుల ఆటలో కూడా ఏదో ఒక సమయంలో వర్షం వచ్చింది. అయితే ఈ రోజుకూడా వర్షం రావడంతో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యం అవుతుంది. ఇక నిన్న ఆట ముగిసే సమయానికి  9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (60) తో పాటు చివరి ఆటగాడు నసీమ్ షా(1)తో ఉన్నారు. అయితే నిన్ననే పాక్ ఆల్ ఔట్ అవుతుంది అనుకున్నారు. కానీ చివరి సెషన్ కు వెలుతురు సరిగ్గా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. దాంతో పాక్ తప్పించుకుంది అనే చెప్పాలి. ఇక ఈ రోజు వరుణుడు రావడంతో ఆట ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది తెలియదు.