ఇంగ్లాండ్-పాకిస్థాన్ : బాల్ పడకుండానే మొదటి సెషన్ రద్దు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : బాల్ పడకుండానే మొదటి సెషన్ రద్దు...

కరోనా విరామం తర్వాత ఇంగ్లాండ్ తో పాకిస్థాన్ తన మొదటి అంతర్జాతీయ సిరీస్ ఆడుతుంది. అందులో జరిగిన మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో 1-0 తో ఆధిక్యం లోకి వెళ్ళింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ కు రోజు వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. ఇక ఈ రోజు జరగాల్సిన మూడో రోజులో వర్షం కారణంగా ఒక బాల్ కూడా పడకుండానే మొదటి సెషన్ రద్దయ్యింది. ప్రస్తుతం ఇప్పుడు ఆటగాళ్లకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. మరి ఈ విరామం తర్వాత ప్రారంభం కావాల్సిన రెండో సెషన్ లోనైనా కనీసం వరుణుడు కరుణిస్తాడు ... లేదా రోజు మొత్తం ఆయన అకౌంట్లోకే వెళ్తుందా.. అనేది చూడాలి. పాక్ తన మొదటి ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.