ఇంగ్లాండ్-పాకిస్థాన్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో ఈ రోజు చివరి మ్యాచ్ జరుగుతుంది. అందులో టాస్ గెలిచినఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో 1-0 తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ మ్యాచ్ ఇంగ్లాడ్ గెలిచిన లేక డ్రా అయిన సిరీస్ వారి సొంతం అవుతుంది. అదే పాక్ గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. 

ఇంగ్లాండ్ జట్టు : టామ్ బాంటన్, జానీ బెయిర్‌స్టో (wk), డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్ (c), మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లూయిస్ గ్రెగొరీ, టామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

పాకిస్థాన్ జట్టు : బాబర్ ఆజమ్ (c), ఫఖర్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్ (w), షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, వహాబ్ రియాజ్, షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్