ఇంగ్లాండ్-పాకిస్థాన్ చివరి టెస్ట్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ఇంగ్లాండ్-పాకిస్థాన్ చివరి టెస్ట్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ ఈ రోజు ప్రారంభం అవుతుంది.  రెండో టెస్ట్ కు ప్రతిరోజు అడ్డుపడ్డ వరుణుడు ఈ మూడో టెస్ట్ ను కూడా పలకరించి వెళ్ళాడు. వర్షం కారణంగా కొంత ఆలస్యం అయిన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. ఇక మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో మొదటిది ఇంగ్లాండ్ గెలవగా రెండోవది డ్రా గా ముగిసింది. కాబట్టి ఈ చివరి మ్యాచ్ లో పాక్ విజయం సాధిస్తే ఈ సిరీస్ డ్రా గా ముగుస్తుంది. ఒకవేళ ఇంగ్లాండ్ విజయ సాధించిన లేక డ్రా అయిన కూడా సిరీస్ ఇంగ్లాండ్ చేతికి వెళ్తుంది.

ఇంగ్లాండ్ జట్టు : రోరే బర్న్స్, డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జో రూట్ (c), ఆలీ పోప్, జోస్ బట్లర్ (wk), క్రిస్ వోక్స్, డొమినిక్ బెస్, జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

పాకిస్థాన్ జట్టు : షాన్ మసూద్, అబిద్ అలీ, అజార్ అలీ (c), బాబర్ ఆజామ్, అసద్ షఫీక్, ఫవాద్ ఆలం, మహ్మద్ రిజ్వాన్ (wk), యాసిర్ షా, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా