ఇంగ్లాండ్-పాకిస్థాన్ : చివరి టెస్ట్ రెండో రోజు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : చివరి టెస్ట్ రెండో రోజు...

కరోనా విరామం తర్వాత పాకిస్థాన్ తన మొదటి టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ తో ఆడుతుంది. ఇక మూడు  మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో నిన్న చివరి టెస్ట్ ప్రారంభమైంది. అందులో ఇంగ్లాండ్ జట్టు పై చేయి సాధించింది అని చెప్పాలి. నిన్న ఇంగ్లండ్‌ ఆటగాడు జాక్‌ క్రాలే (171) శతకంతో మెరిశాడు. ఆ తరువాత అతనికి వికెట్ కీపర్ జోస్‌ బట్లర్‌ (87) తోడయ్యాడు. అయితే నిన్న ఆటముగిసే సమయానికి వీరు ఔట్ కాకపోవడంతో ఈ రోజు ఆటను ఈ ఇద్దరు ఆటగాళ్లే ప్రారంభిస్తారు. 127 పరుగులకు 4 వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లాడ్ వీరి  205 పరుగుల భాగస్వామ్యంతో మరో వికెట్ పడకుండా 332 పరుగులు చేసింది. ఇక ఈ రోజు ఆటలో క్రాలే డబల్ సెంచరీ చేస్తాడా.. లేదా చూడాలి.