ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మూడో టెస్ట్ మూడో రోజు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మూడో టెస్ట్ మూడో రోజు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో మూడో రోజు ప్రారంభమైంది. ఇక నిన్న 8 వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లాండ్ 583 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అందులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు క్రాలే 267 పరుగులు, బట్లర్‌ 152 పరుగులు చేసి 359 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక తమ మొదటి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ నిన్న ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. అయితే నిన్న చివరి బంతికి పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ పెవిలియన్ కు చేరుకోగా కెప్టెన్ అజార్ అలీ (4)తో కలిసి కొత్త బాట్స్మెన్ అసద్ షఫీక్ ఆటను ప్రారంభిస్తున్నాడు. అయితే ఇప్పటికి పాక్ ఇంగ్లాండ్ కంటే 559 పరుగులు వెనుకబడి ఉంది. చూడాలి మరి పాక్ ఈ రోజు లిడ్ లోకి వస్తుందా... లేదా అనేది.