ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మూడో టెస్ట్ నాలుగో రోజు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మూడో టెస్ట్ నాలుగో రోజు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్  583 పరుగుల వద్ద డిక్లేర్ చేసి పాక్ ను మొదటి ఇన్నింగ్స్ లో 273 పరుగులకు ఆల్ ఔట్ చేసింది. అందులో పాక్ కెప్టెన్ అజార్ అలీ (141*) ఒకడే చివరి బ్యాటింగ్ చేసి నాట్  ఔట్ గా నిలిచాడు. ప్రస్తుతం పాక్ ఇంగ్లాండ్ కంటే ఇంకా  310 పరుగులు వెనుకంజలో ఉంది. కాబట్టి పాక్ ఫాలోఆన్ చేయాల్సి వస్తుంది. తమ రెండో ఇన్నింగ్స్ లో పాక్ ఆధిక్యం లోకి వచ్చి ఆ తర్వాత ఆతిధ్య జట్టును ఆల్ ఔట్ చేసి విజయం సాధించాలంటే కష్టమే. ఇక నిన్న రోజు ముగిసే సమయానికి ఆల్ ఔట్ అయిన పాక్ ఈ రోజు తమ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తుంది. అయితే మూడు  మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇప్పటికే 1-0 ఆధిక్యం లో ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిచిన లేక డ్రా చేసుకున్న సిరీస్ వారి సొంతం అవుతుంది.