ఇంగ్లాండ్-పాకిస్థాన్ : పాక్ కు మద్దతుగా నిలిచిన వరుణుడు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : పాక్ కు మద్దతుగా నిలిచిన వరుణుడు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో పాక్ కు మద్దతుగా వరుణుడు వచ్చాడు. మొదటి ఇన్నింగ్స్ లో 273 పరుగులకు ఆల్ ఔట్ అయిన పాక్ ఇంగ్లాండ్ కంటే 310 పరుగులు వెనుకంజలో ఉండటంతో ఫాలోఆన్ చేయాల్సి వచ్చింది. ఇక నిన్న నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 2 వికెట్లు చేజార్చుకొని 100 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా ఆట సాగలేదు. ప్రస్తుతం కెప్టెన్ అజార్ అలీ (29), వైస్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (4) క్రీజులో ఉన్నారు. అయితే నిన్న ఆట పూర్తిగా సాగితే పాక్ కు ఓటమి తప్పనిసరి అయ్యేది. ఇప్పటికి కూడా సిరీస్ వారి సొంతం కాదు. కానీ వారు దానిని ఓడిపోతారా... లేదా డ్రా చేసుకుంటారా అనేది ప్రశ్నగా ఉంది. రేపు కూడా వరుణుడు వస్తే పాక్ కు మంచిదే అని చెప్పాలి. లేక ఆట పూర్తిగా సాగితే వారి ఓటమికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే పాక్ 1-0 తో ఓడిపోతుందా 2-0 తో సిరీస్ కోల్పోతుందా అనేది చూడాలి. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.