ఇంగ్లాండ్-పాకిస్థాన్ : చివరి టెస్ట్ చివరి రోజుకు వరుణుడు అడ్డు..

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : చివరి టెస్ట్ చివరి రోజుకు వరుణుడు అడ్డు..

పాకిస్థాన్ ఇంగ్లాండ్ పర్యటన ఈ రోజుతో ముగియనుంది. మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టు ఈ రోజు చివరి టెస్ట్ లో చివరి రోజు ఆడాల్సి ఉంది. కానీ దానికి వరుణుడు అడ్డుపడుతున్నాడు. కాబట్టి మ్యాచ్ ప్రారంభానికి ఆలస్యం అవుతుంది. ఇక ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి ఇంగ్లాండ్ విజయం సాధించగా ఒకటి డ్రా గా ముగిసింది. ఈ చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్  583 పరుగుల వద్ద డిక్లేర్ చేసి పాక్ ను మొదటి ఇన్నింగ్స్ లో 273 పరుగులకు ఆల్ ఔట్ చేసింది. అందువల్ల పాక్ ఇంగ్లాండ్ కంటే ఇంకా 310 పరుగులు వెనుకంజలో ఉంది. కాబట్టి పాక్ ఫాలోఆన్ చేస్తుంది. నిన్న తమ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన పాక్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు చేజార్చుకొని 100 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా ఆట సాగలేదు. ప్రస్తుతం కెప్టెన్ అజార్ అలీ (29), వైస్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (4) క్రీజులో ఉన్నారు. ఇక ఈ రోజు వర్షం కారణంగా ఆట జరగకపోతే ఈ మ్యాచ్ కూడా మళ్ళీ డ్రా అవుతుంది. దాంతో  1-0 తో సిరీస్ ఇంగ్లాడ్ గెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.