ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మ్యాచ్ డ్రా... సిరీస్ ఇంగ్లాండ్ సొంతం

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మ్యాచ్ డ్రా... సిరీస్ ఇంగ్లాండ్ సొంతం

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య నిన్న ముగిసిన మూడో మ్యాచ్ డ్రా అయ్యింది. అయితే వర్షం రాకతో మొదటి రెండు సెషన్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా ఒక చివరి సెషన్ మాత్రమే ఆట నడిచింది. ఇది ఒకరకంగా పాక్ కు మంచిదే అని చెప్పాలి. ఎందుకంటే రోజు మొత్తం మ్యాచ్ నడిస్తే ఇంగ్లాండ్ బౌలర్లను రోజంతా ఎదుర్కోవడం వారికి కష్టం అయ్యేది. చివరి రోజును పాకిస్థాన్100/2 వద్ద ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి మ్యాచ్ ను డ్రా గా ముగించింది. ఇందులో పాక్ వైస్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (63) తో రాణించాడు. ఇక ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్  583 పరుగుల వద్ద డిక్లేర్ చేసి పాక్ ను 273 పరుగులకు ఆల్ ఔట్ చేసింది. అందువల్ల ఇంగ్లాండ్ కంటే ఇంకా 310 పరుగులు వెనుకంజలో ఉన్న పాక్ ఫాలోఆన్ చేసింది. అయితే జరిగిన మూడు మ్యాచ్ ల్లో మొదటిది ఇంగ్లాండ్ విజయం సాధించగా రెండు, మూడు మ్యాచ్ లు డ్రా కావడంతో 1-0 తో సిరీస్ ఇంగ్లాడ్ సొంతం  చేసుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో 267 పరుగులు చేసిన జాక్‌ క్రాలే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలువగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా మహ్మద్ రిజ్వాన్, జోస్ బట్లర్ నిలిచారు.