ఇంగ్లాండ్-వెస్టిండీస్ : మూడో రోజు ఆట మొదలు...

ఇంగ్లాండ్-వెస్టిండీస్ : మూడో రోజు ఆట మొదలు...

సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదట టెస్ట్ మ్యాచ్ లో మూడవ రోజు ప్రారంభమైనది. అయితే నిన్నటి ఆటలో కరేబియన్ జట్టు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలో ఆధిపత్యం చూపించింది . నిన్న టీ బ్రేక్ సామయానికే ఇంగ్లాండ్ 204 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇక తర్వాత బ్యాటింగ్ కు దిగ్గిన కరేబియన్ జట్టు జాన్ కాంప్‌బెల్(28) వికెట్ కోల్పోయారు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రైగ్ బ్రాత్‌వైట్(20),  షాయ్ హోప్,(6) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఆ ఒక్క వికెట్ తీసుకున్నాడు. మరి కనీసం ఈ రోజైన ఇంగ్లాండ్ తన సొంత మైదానం  లో ఆధిపత్యాన్ని చెలాయిస్తుందా... లేదా అనేది చూడాలి.