ఇంగ్లాండ్-వెస్టిండీస్ : మొదలైన నాలుగో రోజు ఆట... 

ఇంగ్లాండ్-వెస్టిండీస్ : మొదలైన నాలుగో రోజు ఆట... 

ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో జరిగిన మూడు రోజుల ఆటలో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు పైన కరేబియన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో 204 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 318  పరుగులు చేసి 114 పరుగుల ఆధిక్యం లోకి వెళ్ళింది. ఇక నిన్న తమ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన  ఆతిధ్య జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 15 పరుగులు రోరే బర్న్స్(10),  డోమ్ సిబ్లీ (5) పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక ఈ రోజు నాలుగో రోజు ఆటలోనైనా ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని చెలాయిస్తుందా.. లేదా అనేది చూడాలి.