క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు

క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు

ఐసీసీ ప్రపంచ కప్ లో భాగంగా వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ సరికొత్త రికార్డును సాధించాడు. వన్డే ఫార్మాట్ లో ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు(1632) చేసిన బ్యాట్స్‌మన్ గా ఘనతను సాధించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా (1625) పేరిట ఉన్న రికార్డును గేల్ అధిగమించాడు. వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు సాధించడానిక గేల్‌కు పట్టిన ఇన్నింగ్స్‌లు 34 కాగా, సంగక్కరాకు 41 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో గేల్‌, సంగక్కరాల తర్వాత స్థానంలో వివ్‌ రిచర్డ్స్‌(1619), రికీ పాంటింగ్‌(1598), మహేలా జయవర్థనే(1562)లు ఉన్నారు.