స్వల్ప స్కోరుకే విండీస్ ఆలౌట్

స్వల్ప స్కోరుకే విండీస్ ఆలౌట్

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లీష్ బౌలర్ల దాటికి విండీస్ బ్యాట్స్‌మన్లు చేతులెత్తేశారు. దీంతో 44.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విండీస్‌లో బ్యాట్స్‌మన్లలో నికోలస్‌ పూరన్‌(63; 78 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. షిమ్రన్ హెట్‌మైయిర్‌ (39; 48 బంతుల్లో, 4 ఫోర్లు), క్రిస్‌గేల్‌ (36; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), అండ్రూ రస్సెల్( 21; 16 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్సులు) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో యువ పేసర్‌ జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్ చెరో మూడు వికెట్లు తీసి విండీస్ ను భారీ దెబ్బతీశారు.