ఇంగ్లాండ్-వెస్టిండీస్ : చివరి రోజు... విజయం ఎవరిదో..?

ఇంగ్లాండ్-వెస్టిండీస్ : చివరి రోజు... విజయం ఎవరిదో..?

కరోనా విరామం తర్వాత మొదలైన ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ చివరి రోజు ఆట ప్రారంభమైంది. అయితే తమ రెండో ఇన్నింగ్స్ లో నిన్న ఆట ముగిసే ఇంగ్లాండ్  ఆటగాళ్లు 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి 170 పరుగుల ఆధిక్యాని సంపాదించారు. ఈ మ్యాచ్ లో కరేబియన్లు విజయం సాధించాలంటే ఆతిధ్య జట్టును ఆల్ ఔట్ చేసి వారు ఇచ్చిన లక్ష్యాన్ని చేధించాలి. ఇక ఇంగ్లాంగ్ గెలవాలంటే వారి ఇన్నింగ్స్ తర్వాత  వెస్టిండీస్ ను ఆల్ ఔట్ చేయాలి. కానీ ఈ మ్యాచ్ గెలవడానికి  వెస్టిండీస్ జట్టుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఆట  జోఫ్రా ఆర్చర్(5),  మార్క్ వుడ్(1) బ్యాటింగ్ ప్రారంభించారు.