బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్..

బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్..

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో కాసేపట్లో చెస్టర్‌లీస్ట్రీట్ వేదికగా మరో కీలకమైన పోరు జరగనుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్ 4లో స్థానం సంపాదించిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ఇక ఇప్పటి వరకు వరల్డ్ కప్‌లో చేరో ఎనిమిది మ్యాచ్‌లు ఆడాయి ఈ రెండు జట్లు. అయితే, న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌లు గెలిచి.. రెండు మ్యాచ్‌ల్లో ఓడి 11 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా... ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి.. మూడు మ్యాచ్‌ల్లో ఓడి.. 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది ఇంగ్లండ్ జట్టు. ఇక, ఇప్పటికే 14 పాయింట్లతో ఆస్ట్రేలియా  జట్టు... 13 పాయింట్లతో ఉన్న టీమిండియా వరల్డ్ కప్ సెమీస్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.