వ‌న్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ వరల్డ్‌ రికార్డు

వ‌న్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ వరల్డ్‌ రికార్డు

వన్డేల్లో ఇంగ్లండ్ జట్టు వరల్డ్‌ రికార్డు నెలకొల్పింది. 50 ఓవర్లలో ఏకంగా 481 పరుగులు బాదేసి ఆస్ట్రేలియా బౌలర్లను బెంబేలెత్తించింది. టెంట్‌బ్రిడ్జ్‌లో జ‌రిగిన మూడ‌వ వ‌న్డేలో  41 ఫోర్లు, 21 సిక్సర్ల సహాయంలో ఈ భారీ స్కోరు చేసింది. తద్వారా.. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది.   ఫలితంగా ఇప్పటి వరకు తమ పేరిటే ఉన్న 444 పరుగుల (2016లో పాకిస్తాన్‌పై) రికార్డును తుడిచి పెట్టింది. ఇంగ్లండ్‌ జట్టులో అలెక్స్‌ హేల్స్‌ (92 బంతుల్లో 147; 16 ఫోర్లు, 5 సిక్సర్లు), బెయిర్‌స్టో (92 బంతుల్లో 139; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలు చేయగా జాసన్‌ రాయ్‌ (61 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్‌ మోర్గాన్‌ (30 బంతుల్లో 67; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదవడం విశేషం. ఆసీస్‌ బౌలర్లలో టై 100 పరుగులు, రిచర్డ్సన్‌ 92, స్టొయినిస్‌ 85 పరుగులు సమర్పించుకున్నారు. ఇక.. 482 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 239 పరుగులకే కుప్పకూలింది. రషిద్‌ (4/47) ఆసీస్‌ను దెబ్బ తీశాడు.