ఎంత మంచివాడవురా టీజర్: రాముడు మంచోడే.. కానీ.. 

ఎంత మంచివాడవురా టీజర్: రాముడు మంచోడే.. కానీ.. 

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ఎంత మంచివాడవురా సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్.  నందమూరి కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు.  కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులు కళ్యాణ్ రామ్ ను ఒక్కొక్కరు ఒక్కోరకంగా పిలుస్తూ.. మంచివాడు అని చెప్తుంటారు.  ఇందిలో కళ్యాణ్ రామ్ పేరు బాలు.. 

ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేరుతో పిలుస్తూ.. మంచి వాడు అని చెప్తుంటే.. బ్యాక్ గ్రౌండ్ లో ఫైట్ జరుగుతుంటుంది.  అందరు మంచివాడు మంచి వాడు అంటుంటే.. నువ్వెంట్రా అలా కొడుతున్నావ్ అని అంటే.. రాముడు మంచివాడేరా.. కానీ రావణాసురుడిని వేసేయ్ లా అని చెప్పడంతో టీజర్ ఉద్దేశ్యం ఏంటి అన్నది తేలిపోయింది.  చివర్లో మళ్ళీ ఎప్పుడు వస్తావ్ అని భరణి అడిగితె సంక్రాంతికి నాన్న అని చెప్పడం వెనుక సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అర్ధం అవుతున్నది.  టీజర్ కూల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉండటం విశేషం.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.