డేట్‌ లాక్ చేసిన "ఎంత మంచి వాడవురా!"

డేట్‌ లాక్ చేసిన "ఎంత మంచి వాడవురా!"

నందమూరి కల్యాణ్‌ రామ్ "ఎంత మంచివాడవురా!"తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. సతీష్ వేగేష్న దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికి విడుదలై ఆకట్టుకుంది. టీజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నట్టుగా ఇంట్ ఇచ్చింది చిత్రయూనిట్.. ఇక, ఇవాళ "ఎంత మంచివాడవురా!" రిలీజ్ డేట్‌ను లాక్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు హీరో కల్యాణ్ రామ్.. జనవరి 15వ తేదీన సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మిస్తుండగా.. కల్యాణ్‌ రామ్ సరసన మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.