భారత ఆటగాళ్ల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోర్గాన్...

భారత ఆటగాళ్ల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోర్గాన్...

ప్రపంచంలో ఏ లీగ్ లు జరిగినా.. వాటిలో పాల్గొనేందుకు టీమిండియా ఆటగాళ్లు ఆసక్తి కనబరుస్తారని ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ మోర్గాన్ అన్నాడు. తమ దేశంలో జరిగే ది హండ్రెడ్ బాల్ క్రికెట్ లీగ్ లో ఆడాలని చాలామంది భారత క్రికెటర్లు కోరుకుంటారని చెప్పారు. సాధారణంగా వీళ్లు కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారనీ.. అక్కడి సంప్రదాయాలపై ఆసక్తి చూపిస్తారన్నారు. వాళ్లు ఆడితే లీగ్స్ కే ఆకర్షణ వస్తుందన్నారు. దాంతో వ్యాపారం కూడా పెరుగుతుంది అంటున్నారు మోర్గాన్. అయితే ద్వైపాక్షిక సిరీస్ ల కోసం ఇండియా వచ్చిన ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ కోసం ఇక్కడే ఉన్నారు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ఐపీఎల్ లో కేకేఆర్ న్యాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది  లీగ్ మధ్యలో జట్టు పగ్గాలు అందుకున్న మోర్గాన్ ఈ ఏడాది జట్టును విజేతగా నిలపాలని చూస్తున్నాడు.