ధోని రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్...

ధోని రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్...

వన్డే సూపర్ లీగ్ లో భాగంగా ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఈ రోజు చివరి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఎయోన్ మోర్గాన్ భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డు బ్రేక్ చేసాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డును మోర్గాన్ బ్రేక్ చేసాడు. ఈ రోజు సౌతాంప్టన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన 3 వ వన్డేలో మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన 212 వ సిక్స్ కొట్టాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ధోని (211 సిక్సర్లు) పేరు మీద ఉంది. అయితే ఈ ఘనతను మోర్గాన్ కేవలం 163 మ్యాచ్‌ లో సాధించాడు. కానీ భారత మాజీ కెప్టెన్ 211 సిక్సర్లకు 332 అంతర్జాతీయ మ్యాచ్‌లు తీసుకున్నాడు. ఇక ఇందులో రికీ పాంటింగ్ (324 మ్యాచ్‌లలో 171 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (121 మ్యాచ్‌లలో 170 సిక్సర్లు ) ఎబి డివిలియర్స్ (124 మ్యాచ్‌ల్లో 135 సిక్సర్లు) తో తర్వతి 3,4,5 స్థానాల్లో ఉన్నారు.