మోర్గాన్ సిక్సర్ల వర్షం; సరికొత్త రికార్డు నమోదు

మోర్గాన్ సిక్సర్ల వర్షం; సరికొత్త రికార్డు నమోదు

ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్ లో అఫ్గనిస్థాన్‌కు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు చుక్కలు చూపించారు. కెప్టెన్ మోర్గాన్(148; 71 బంతుల్లో 4ఫోర్లు, 17 సిక్సర్లు) ఆఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జానీ బెయిర్‌స్టో(90; 99 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు), జో రూట్(88; 82 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్), మొయిన్ అలీ(31; 9 బంతుల్లో ఫోర్, 4సిక్సర్లు) తమదైన శైలిలో హిట్టింగ్ చేయడంతో 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 6 వికెట్లకు 397 పరుగులు చేసింది. 

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఏకంగా 17 సిక్స్‌లు బాది వన్డే క్రికెట్‌లో సిక్సర్ల రికార్డులో నూతన చరిత్ర సృష్టించాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్‌గా మోర్గాన్‌ నిలిచాడు. ఇప్పటివరకూ వన్డేల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో రోహిత్‌శర్మ(16 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్(16), క్రిస్‌ గేల్‌(16) ముందు వరుసలో ఉన్నారు.