ఇప్పుడు పీఎఫ్ ఖాతాదారుల వంతు..! భారీ షాక్ తప్పదా..?

ఇప్పుడు పీఎఫ్ ఖాతాదారుల వంతు..! భారీ షాక్ తప్పదా..?

పరిస్థితి చూస్తుంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఫీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్ తప్పేలా లేదు... ఈపీఎఫ్‌వో పీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటు కోత పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే జరిగితే కోట్ల మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడబోతోంది. దీంతో ఉద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర కోతపెట్టే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. వడ్డీ రేటు తగ్గిస్తే పీఎఫ్ డబ్బుపై 6 కోట్ల మందికి పైగా ఉద్యోగులకు తక్కువ రాబడి రానుంది. 

కాగా, ఈపీఎఫ్‌వో తన పీఎఫ్ ఖాతాదారులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.65 శాతం వడ్డీ రేటు అందుకుంటున్నారు... మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాపై తక్కువ వడ్డీ వచ్చే అవకాశముంది. దీంతో నేరుగానే ఉద్యోగులపై ప్రభావం పడనుంది. పీఎఫ్ ఖాతాలపై వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయం ఈ నెల చివరకు తీసుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. పలు దఫాలుగా వడ్డీరేట్లు తగ్గుతూ వస్తున్న ఈ తరుణంలో ఈపీఎఫ్‌వో 8.65 శాతం వడ్డీని అమలు చేయడం అసాధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు.