నటిని కాల్చి చంపిన పోలీసులు

నటిని కాల్చి చంపిన పోలీసులు

హాలీవుడ్ నటి వెనెస్సా మెర్క్యూజ్ క్యాలిఫోర్నియాలోని సౌత్ పెసడేనాలో పోలీస్ కాల్పుల్లో మృతి చెందారు.  ఎంబీసీ డ్రామా ఈఆర్ లో ఆమె నర్స్ క్యారెక్టర్ చేశారు.  గత కొంతకాలంగా వెనెస్సా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు.  గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ వచ్చిందట.  వెనెస్సాకు హెల్ప్ చేసేందుకు పోలీసులు 90 నిమిషాలకు పైగా ప్రయత్నించారు.  అయినప్పటికీ వెనెస్సా తన దగ్గర ఉన్న గన్ తో కవ్విచండంతో తప్పని సరిపరిస్థితుల్లో కాల్పులు జరిపినట్టుగా పోలీసులు చెప్పారు.